కాంగ్రెస్‌ వస్తే అంధకారమ..బీజేపీ నీటి వాటా తేల్చకుండా రాజకీయం చేస్తున్నారు : కేటిఆర్

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అంధకారం

Update: 2023-10-05 12:18 GMT

దిశ, షాద్ నగర్ : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అంధకారం గ్యారెంటీ అభివృద్ధి కావాలా అంధకారం కావాలా అని ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు.గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో కొత్తూరు మున్సిపల్ భవనం,నందిగామ మండలం చాకలిదాని గుట్ట గ్రామ పంచాయతీ భవనం, షాద్ నగర్ డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారితో కలిసి ప్రారంభించారు.అనంతరం బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ,65 ఏళ్లలో 11 సార్లు కేంద్రంలో, రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి అవకాశం ఇస్తే కేసీఆర్‌ ఇప్పుడు చేసిన వాటిల్లో ఒక్క పని కూడా చేయరు.

ఎన్నికల వేళల్లో వచ్చి హడావిడి తప్ప చేసేది ఏమీ లేదంటూ మోసం చేసేందుకు వస్తున్నారని ధ్వజమెత్తారు.తొమ్మిది ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీతో జరిగిన అభివృద్ధి ప్రజలకు తెలుసు అని మీ మాయమాటలు ఎవ్వరు నమ్మరు అని ఆ దిక్కుమాలిన రోజులు మళ్లీ రావాలనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టులపై కేసులేసి పనులు జరగకుండా మళ్ళీ పూర్తవుతలేవ్ అని అనడం సిగ్గుచేటని, ఇయాల కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం సచ్చిన పీనుగ లాంటి కాంగ్రెస్ దింపుడు గల్లం ఆశతోని ఏమైనా నాలుగు ఓట్లు పదయతాయేమో ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ కడుపులో గుద్ది నోట్లో మిఠాయి పెట్టే రకం.టీపీసీసీ ప్రెసిడెంట్ ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి అన్నారు.‘కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కరెంట్‌ కష్టాలు, నీళ్లకోసం యుద్ధాలు గ్యారెంటీ, రైతులకు ఎరువులు, విత్తనాలు అందక చెప్పులను లైన్‌లో పెట్టుడు గ్యారెంటీ అని అన్నారు.వారెంటీ లేని కాంగ్రెస్‌ పార్టీ గ్యారెంటీ ఇస్తుందట అని దుయ్యబట్టారు.నాడు 200 ఇయ్యని కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, కర్ణాటకలో రూ.4 వేలు పెన్షన్‌ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రజలను హామీలతో మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు.అక్రమంగా దోచుకున్న డబ్బులతో వస్తున్నారు.ఇతర రాష్ట్రాల్లో దోచుకున్న డబ్బులతో కొందరు నాయకులు వస్తున్నారని, కానీ ప్రజలు ఆగం కావద్దని కేటీఆర్‌ అన్నారు. ఒక్కసారి మోసపోతే.. గోస పడ్తామన్నారు. ‘కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇచ్చే డబ్బులు తీసుకుని జేబులో పెట్టుకోండి.. మీకోసం పని చేసే కేసీఆర్‌ను,అంజయ్య యాదవ్ ను ఆశీర్వదించండి’అని సూచించారు.అంజన్న గెలిచినట్టే ఇది బహిరంగ సభాల లేదు విజయోత్సవ సభలా ఉందని అన్నారు.కొత్తూరు మండలము సిద్దాపూర్ గ్రామం లో 334 ఎకరాలలో ఒక ఐటీ హబ్ ఏర్పాటు చేయబోతున్నాం అని షాద్ నగర్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు వస్తుందని ,అసలు హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ మధ్య ఉన్నదే అసలు హైదరాబాద్ కానున్నది అని మెట్రో కూడా కొత్తూరు వరకు వస్తుందని ఇవన్నీ జరగాలంటే మళ్ళీ సీఎం కేసీఆర్ కావాలని అల్లాటప్ప నాయకులతోని కాదని వ్యాఖ్యానించారు.కార్యక్రమంలో గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి,ఎమ్మెల్సీ నవీన్ కుమార్,సహకార యూనియన్ చైర్మన్ రాజ వరప్రసాద్ రావ్, జెడ్పీ చైర్మన్ తీగల అనితా రెడ్డి,వైస్ చైర్మన్ ఈట గణేష్, మున్సిపల్ చైర్మన్ లావణ్య, నరేందర్, మాజీ ఎమ్మెల్యేలు బీశ్వ కిష్టయ్య, ఇందిర, ఎంపీపీలు,జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీ లు,కొన్సిలర్లు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు,ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News