రైతుబంధు ఆపింది కాంగ్రెస్సే : సీఎం కేసీఆర్
రైతుబంధు ఆపింది కాంగ్రెస్ పార్టీ అని షాద్ నగర్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ అన్నారు. షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షాద్ నగర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని సీఎం కేసీఆర్ మాట్లాడుతూ
దిశ,షాద్ నగర్ : రైతుబంధు ఆపింది కాంగ్రెస్ పార్టీ అని షాద్ నగర్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ అన్నారు. షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షాద్ నగర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… యాసంగి సాయం రైతులకు ఇవ్వనియ్యకుండ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో రైతు బంధు సాయం ఆగింది అని తెలిపారు. రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ మరోసారి రుజువైందని అన్నారు. కాంగ్రెస్ ను నమ్మితే అభివృద్ధి ఆగుతుందని, కాంగ్రెస్ పార్టీ వస్తే దళారీల రాజ్యం వస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దని, అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని అన్నారు. వచ్చేది మన ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. హైదరబాద్ నుంచి షాద్ నగర్ వరకు అంజయ్య యాదవ్ పట్టుబట్టి మెట్రో రైలు మార్గాన్ని కావాలని సాధించాడన్నారు.
మెడికల్ కాలేజీ, పీజీ కాలేజీల ఏర్పాటుకు కృషి చేస్తాని హామి ఇచ్చారు. అంజయ్య మంచి పనిమంతుడు, వజ్రం లాంటి మనిషి అలాంటి వ్యక్తిని గెలిపించుకునే బాధ్యత మీ అందరిదీ అని అన్నారు. అంజయ్య యాదవ్ పై ప్రశంసలు కురిపించారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ… సుమారు అయిదు వేల కోట్ల రూపాయలతో సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి సాధించుకున్నాం అని తెలిపారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది అన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, కమ్మదనం ఈకో పార్క్ ఏర్పాటు చేసుకోవాలని, కోల్డ్ స్టోరేజ్ వంటివి అనేక అభివృద్ధి పనులు సాధించుకోవాలి తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ని నమ్మితే మళ్ళీ యాభై ఏళ్లు వెనక్కి వెళ్తాం అని, ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ చేసిందని అన్నారు.