Janwada farm house : జన్వాడ ఫామ్ హౌస్ కేసులో దర్యాప్తు ముమ్మరం

జన్వాడ ఫేమస్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆధారాలు సేకరించిన చేవెళ్ల ఎక్సైజ్ శాఖ శుక్రవారం ఫామ్ హౌస్ కేసులో కీలక నిందితులైన రాజ్ పాకాల, విజయ్ మద్దూరి లు చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ విచారణకు హజరైయ్యారు.

Update: 2024-11-01 16:29 GMT

దిశ, చేవెళ్ల: జన్వాడ ఫామ్ హౌస్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆధారాలు సేకరించిన చేవెళ్ల ఎక్సైజ్ శాఖ శుక్రవారం ఫామ్ హౌస్ కేసులో కీలక నిందితులైన రాజ్ పాకాల, విజయ్ మద్దూరి లు చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ విచారణకు హజరైయ్యారు. రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీలో డ్రగ్స్, విదేశీ లిక్కర్ బాటిల్ లపై ఆరా తీశారు. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడం తో పాటు ఫారిన్ లిక్కర్ వాడినందుకు ఎక్సైజ్ ఆక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఫారిన్ లిక్కర్ బాటిళ్లను ఎలా తీసుకొచ్చారు. దానిని ఇక్కడి నుంచి ఎలా రవాణా చేశారు అనే దానిపై విచారణ జరిపారు అని తెలుస్తుంది. దాదాపు 1:50pm గంటలకు లోనికి వెళ్లిన రాజ్ పాకాల 8:15pm గంటలకు బయట వచ్చారు.

విచారణకు సహకరించిన రాజ్ పాకాల :డిప్యూటీ కమిషనర్ దశరథ్

రాజ్ పాకాల విచారణ కు సంహరించారు. కేసు కంట్యూను ఉంటుంది.


Similar News