ప్రజలు అడిగింది చేయకపోతే నేనెందుకు : ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
హనుమాన్ నగర్,భూపాల్ నగర్ జలాల్ బాబా నగర్ ప్రజలకు

దిశ, శంషాబాద్ : హనుమాన్ నగర్,భూపాల్ నగర్ జలాల్ బాబా నగర్ ప్రజలకు వెంటనే పట్టాలు ఇవ్వాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. ప్రజలు అడిగింది చేయడమే నా బాధ్యతని అన్నారు.మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా ఫారెస్ట్ భూముల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని హనుమాన్ నగర్,భూపాల్ నగర్ జలాల్ బాబా నగర్ గ్రామాల ప్రజలు ఇండ్లు నిర్మించుకొని నివాసముంటున్నారని వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని గత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ లను అడగడం జరిగిందని కానీ ఇంతవరకు పరిష్కారం కాలేదని వాపోయారు.
వారికి ప్రతి ఎన్నికల్లో పట్టాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరుగుతుందని నన్ను నియోజకవర్గ ప్రజలు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని వారు అడిగినది చేయాల్సిన బాధ్యత నాపై ఉందని పేర్కొన్నారు. ఆ గ్రామంలో నీళ్లు రోడ్లు వేయాలని ఇబ్బందికరంగా మారిందని అధికారులు, మంత్రులు సమక్షించి సమస్యను పరిష్కరించాలని కోరారు.ఈ ప్రభుత్వమైనా ఆ గ్రామ ప్రజలకు పట్టాలులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పైన పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. ప్రజలు నన్ను నాలుగు సార్లు గెలిపించారని వాళ్ళ అడిగింది నేను చేయకపోతే నేను ఎందుకని ఆవేదన వ్యక్తం చేశారు.