ఒక్క అవకాశం ఇస్తే.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా : మనోహర్ రెడ్డి
ఈ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇస్తే.. తాండూర్ అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి అన్నారు.
దిశ, తాండూరు : ఈ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇస్తే.. తాండూర్ అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా శుక్రవారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్, ఇందిరా, వినాయక చౌక్ లు, శాంతి మాన్ చౌరస్తా , భద్రేశ్వర టెంపుల్ , గాంధీ చౌక్, మర్రిచెట్టు గంజ్ వరకు వేలాది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆటపాటలు ,జన సందోహంతో భారీగా నామినేషన్ ర్యాలీని నిర్వహించారు. సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ..దేశంలో,రాష్ట్రంలో, తాండూరులో సుస్థిర పాలన కాంగ్రెస్‌కే సాధ్యమని న్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్సేనని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు దేవతగా మారిందని, కృతజ్ఞతగా ప్రజలందరూ చేతిగుర్తుకు ఓటు వేయూలని విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్ ఇచ్చిన ఏఒక్క హామీ సక్రమంగా అమ లుచేయలేదని, గతంలో మహిళలకు పావుల వడ్డీకి రుణాలు ఇచ్చామని అన్నారు. డబుల్ బెడ్‌రూం, దళిత బందు, బీసీ బంధు వంటివి కేవలం ఆ పార్టీ కార్యకర్తలకే ఇచ్చారని, పైసలు ఇచ్చినవారిని పథకాలకు ఎంపిక చేసి పేదలను మోసం చేశారన్నారు.
ప్రజా సంక్షేమం పట్టని బీఆర్‌ఎస్ మరోసారి కొత్త హామీలతో మోసం చేయడానికి వస్తు న్నదని, ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తనకు ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని వెల్లడించారు. కార్యకర్తలు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని ఏ ఆపద వచ్చిన కంటికి రెప్పలా కాపాడుకుంటానని స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా పార్టీ అధికారమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి ,రమేష్ మహారాజ్ , మాజీ ఎమ్మెల్యే నారాయణరావు, డాక్టర్ సంపత్ కుమార్, ఆర్బిఎల్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ సునీత సంపత్, లక్ష్మారెడ్డి, ధారాసింగ్, రాకేష్ మహారాజ్, కల్వ సుజాత, కాంగ్రెస్ నాయకులు ,కార్యకర్తలు, వేలాది మంది అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.