మీర్ పేట్ కు హైడ్రా అధికారులు

కార్పొరేషన్ పరిధిలోని చందన చెరువు ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లోని ఖాళీ స్థలాలను బుధవారం హైడ్రా అధికారులు పరిశీలించారు.

Update: 2024-12-04 09:15 GMT

దిశ, మీర్ పేట్: కార్పొరేషన్ పరిధిలోని చందన చెరువు ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లోని ఖాళీ స్థలాలను బుధవారం హైడ్రా అధికారులు పరిశీలించారు. చెరువు కబ్జాకు గురైందని గతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం బాలాపూర్ ఆర్ ఐ ప్రశాంతి, ఇరిగేషన్ ఏఈ జనార్ధన్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది తో కలిసి హైడ్రా ఎమ్మార్వో విజయకుమార్ , హైడ్రా సీఐ తిరుమలేష్ లు ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ హద్దులను పరిశీలించి స్థానిక అధికారుల నుంచి వివరాలు సేకరించారు. చెరువు చుట్టుపక్కల ఆర్ సి ఐ రోడ్డు ఇరువైపుల స్థలాలను పరిశీలించి వివరాలు తీసుకున్నారు. హైడ్రా అధికారులతో పాటు టౌన్ ప్లానింగ్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు, స్థానికులు ఓం ప్రకాష్ తదితరులు ఉన్నారు.


Similar News