సమయపాలన పాటించని వ్యవసాయ అధికారులు..

మాడ్గుల మండల వ్యవసాయ అధికారులు సమయపాలన

Update: 2024-12-04 07:11 GMT

దిశ,మాడ్గుల : మాడ్గుల మండల వ్యవసాయ అధికారులు సమయపాలన పాటించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద అధికారుల కోసం 10:45 నిమిషాల వరకు రైతులు పడిగాపులు కాస్తున్న అధికారులు రాలేదని మాడ్గుల మాజీ ఎంపీటీసీ దేవయ్య గౌడ్, రైతులు ఆరోపించారు. రైతులు తమ పంటను అమ్ముకోవడానికి పాస్ పుస్తకం పరిశీలించి పంటకు సంబంధించిన టోకెన్ ఇవ్వాల్సి ఉండగా అధికారులు రాకపోవడంతో రైతులు తాము ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సకాలంలో అమ్ముకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మండల వ్యవసాయ అధికారులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకొని తమ ఇబ్బందులను తొలగించాలని మండల రైతులు కోరుతున్నారు.


Similar News