మహిళా సంఘాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది : చేవెళ్ల ఎమ్మెల్యే
పొదుపు గ్రూపు మహిళా సంఘాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున రుణాలు
దిశ, శంకర్ పల్లి : పొదుపు గ్రూపు మహిళా సంఘాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పేర్కొన్నారు. శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలో ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రూ. 1.95 కోట్ల రూపాయల చెక్కులు బుధవారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ మహిళా సంఘాలు ప్రభుత్వం ఇచ్చే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమ పిల్లలను బాగా చదివించి అభివృద్ధిలోకి తీసుకురావాలని సూచించారు.
మహిళలు వంటింటికి పరిమితం కాకుండా ప్రభుత్వం ఇచ్చే రుణాల ద్వారా స్వయం ఉపాధి పథకాలు ఏర్పాటు చేసుకొని అభివృద్ధి లోకి రావాలని సూచించారు. ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమాలలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం అభినందనీయమని మున్సిపల్ చైర్ పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట రామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, కౌన్సిలర్ చంద్రమౌళి, శంకర్పల్లి మాజీ సర్పంచ్ ప్రకాష్ గుప్తా, కో ఆప్షన్ సభ్యుడు మహమూద్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి వార్డు అధికారులు మున్సిపల్ సిబ్బంది మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.