సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం లాంటిది
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలనే ఉద్దేశంతో సీఎం ఆర్ ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమని
దిశ, తలకొండపల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలనే ఉద్దేశంతో సీఎం ఆర్ ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమని మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శతాజి, టౌన్షిప్ మేనేజింగ్ డైరెక్టర్ కాసు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తలకొండపల్లి మండలంలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన డి. ఎలమందరెడ్డి అనే వ్యక్తికి ఇటీవల కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స నిర్వహించిన అనంతరం తనకు మంజూరైన చెక్కును శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం కాసు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుపేదల కోసం ఎంతగానో కృషి చేస్తుందని, ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసి మాట నిలుపుకుంటుందని, ప్రతిపక్ష పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పు త్రోవ పట్టిస్తున్నారని విమర్శించారు.