కళ్యాణ లక్ష్మితో ఆడబిడ్డలకు ఆనందం

కళ్యాణ లక్ష్మి పథకం ప్రతి ఒక్క ఆడబిడ్డకు ఆనందదాయకమని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు.

Update: 2024-08-24 12:24 GMT

దిశ, మోమిన్ పేట : కళ్యాణ లక్ష్మి పథకం ప్రతి ఒక్క ఆడబిడ్డకు ఆనందదాయకమని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. శనివారం మోమిన్ పేట మండల కేంద్రంలో రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను 31 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అదేవిధంగా 18 లక్షల 59, వేలు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 31.3596 రూపాయల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో తులం బంగారం అదనంగా అందిస్తున్నట్టు తెలిపారు.

     ఆగస్టు 15 న రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. అతి త్వరలో రైతు భరోసా అందజేస్తామని తెలిపారు. త్వరలో ఇల్లు లేని నిరుపేదలకు 5 లక్షలు అందజేస్తామన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలోని చెరువులను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, ఇన్చార్జ్ ఎంపీడీఓ యాదగిరి, ఆర్ఐ గోవర్ధన్, మండల పార్టీ అధ్యక్షుడు మన్నె శంకర్ యాదవ్, జిల్లా నాయకులు నరత్తం రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సిరాజుద్దీన్, మహేందర్ రెడ్డి, విట్టల్, కోఆప్షన్ సభ్యులు బొగ్ధ ద్ సుభాష్ గౌడ్, మహంత్ స్వామి, వేమారెడ్డి సురేష్, సురేందర్, మణెయ్య యాదవ్, రఘురాం రెడ్డి, బాబు మహేందర్ చారి, మన్మోహన్ గౌడ్, మల్లారెడ్డి, జనార్దన్ రెడ్డి, చంద్రన్న పాల్గొన్నారు. 

Tags:    

Similar News