ఖానాపూర్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
విజయదశమి పర్వదిన సందర్భంగా మండలంలోని ఖానాపూర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలను సోమవారం సాయంత్రం మహిళలు, చిన్నారులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.
దిశ, తలకొండపల్లి : విజయదశమి పర్వదిన సందర్భంగా మండలంలోని ఖానాపూర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలను సోమవారం సాయంత్రం మహిళలు, చిన్నారులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దసరా పండగకు ఒక రోజు ముందుగానే సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించడం చూస్తుంటాం. కానీ రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలంలో ఖానాపూర్ గ్రామంలో దసరా పండగ ముగిసిన తర్వాత మరుసటి రోజు నిర్వహించడం ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుంది. అందులో భాగంగా శనివారం దసరా పండుగ ముగిసిన ఆదివారం నిర్వహించవలసిన బతుకమ్మ సంబరాలను సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు.
ఆ గ్రామంలో ఎన్నో సంవత్సరం నుంచి తమ పెద్దలు పూర్వికులు ఎవరు కూడా ఆదివారం రోజు బతుకమ్మ సంబరాలను నిర్వహించలేదనే ఉద్దేశంతో సోమవారం నిర్వహించినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. బతుకమ్మ సంబరాలు ముగిసిన అనంతరం గ్రామ సమీపంలో ఉన్న చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యురాలు సరిత గణేష్, మాజీ సర్పంచ్ అంజనమ్మ నరసింహ,నాయకులు కసిరెడ్డి వెంకటరెడ్డి, పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ యాదయ్య గౌడ్ ,ముత్యాల రామారెడ్డి, కర్ణాకర్ రెడ్డి, బుచ్చపయ్యా గౌడ్, అంజిరెడ్డి, రఘుమా రెడ్డి, భూపాల్ గౌడ్, శ్రీనివాస్, పిట్టల మల్లేష్ మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.