సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మద్దతు నాకే ఉంది..

రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ మద్దతుతో నియోజకవర్గంలో మనకు మంచి రోజులు రాబోతున్నాయని బీఆర్ఎస్ రాష్ట్రనాయకులు గోళీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Update: 2023-02-05 12:38 GMT

దిశ, ఆమనగల్లు : రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ మద్దతుతో నియోజకవర్గంలో మనకు మంచి రోజులు రాబోతున్నాయని బీఆర్ఎస్ రాష్ట్రనాయకులు గోళీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదని, ప్రజాసేవ ముఖ్యమన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదని, మంచి సమాజ నిర్మాణం కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లు గోళీ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటానని, ప్రతి కార్యకర్తను కుటుంబ సభ్యుల్లాగా ఆదరిస్తానన్నారు. కల్వకుర్తి నియోజకవర్గ ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రైతులు రాజులుగా జీవిస్తున్నారన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శవంతంగా నిలుస్తున్నాయని అన్నారు. ఆదివారం మాడుగుల మండల పరిధి అవురుపల్లి గ్రామంలో గోలి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గోలీ శ్రీనివాస్ రెడ్డి వివిధ పార్టీలకు చెందిన 200 మంది నాయకులకు బీఆర్ఎస్ కండువా కప్పిపార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని, కేసీఆర్ నాయకత్వం వైపు దేశప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ సుభాష్, పెద్దాపూర్ సర్పంచ్ శ్రీనివాస్, నాయకులు శివకుమార్, సతీష్, సుమన్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News