శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత..
గుట్టుచప్పుడు కాకుండా విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబట్ట ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.
దిశ, శంషాబాద్ : గుట్టుచప్పుడు కాకుండా విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబట్ట ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రియాద్ నుండి హైదరాబాద్ రావడానికి విమానాలలో శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ప్రయాణికుడు.
విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నగా ప్రయాణికుడిపై అనుమానం వచ్చిపూర్తిస్థాయిలో స్కానింగ్ చేయగా ప్రయాణికుడి వద్ద బంగారం ఉన్నట్లు గుర్తించారు. పూర్తిస్థాయిలో స్కానింగ్ చేసి గుట్టు చప్పుడు కాకుండా లగేజీ బ్యాగులో బంగారాన్ని పెట్టి తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడి వద్ద 800 గ్రాముల స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదుచేసి విచారిస్తున్నారు.