కల్వకుర్తిలో కసిరెడ్డి నామినేషన్ కు పెద్ద ఎత్తున తరలిన అభిమానులు
నేడు ఎన్నికల నామినేషన్ కు చివరి ఘట్టం కావడంతో కల్వకుర్తి పట్టణానికి శుక్రవారం తలకొండపల్లి మండలంలోని 32 గ్రామ పంచాయతీలకు చెందిన కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు.
దిశ,తలకొండపల్లి : నేడు ఎన్నికల నామినేషన్ కు చివరి ఘట్టం కావడంతో కల్వకుర్తి పట్టణానికి శుక్రవారం తలకొండపల్లి మండలంలోని 32 గ్రామ పంచాయతీలకు చెందిన కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. తలకొండపల్లి ఎక్స్ రోడ్డు వద్ద శుక్రవారం ఉదయం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డోకూరు ప్రభాకర్ రెడ్డి, జిల్లా నాయకులు భగవాన్ రెడ్డి, మోహన్ రెడ్డి, అంజయ్య గుప్తాలు జెండా ఊపి ర్యాలీని ఘనంగా ప్రారంభించారు. కల్వకుర్తి పట్టణానికి నామినేషన్ల దాఖలు పెద్ద సంఖ్యలో జనం తరలి వెళ్లడంతో కల్వకుర్తి పట్టణ మొత్తం కార్యకర్తలతో కిక్కిరిసిపోయి జనసంద్రంగా మారింది. కల్వకుర్తి నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి విజయం కోసం ప్రతి కార్యకర్త మిగిలి ఉన్న ఈ 20 రోజులు రాత్రి అనక పగలనక కష్టపడితే విజయం వరిస్తుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకుర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
గ్రామాలలో ప్రతి కార్యకర్త నేనే అభ్యర్థి అనే విధంగా ప్రచారాన్ని నిర్వహించాలని అప్పుడే విజయం నల్లేరు మీద నడకవుతుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ లక్ష్మీదేవి రఘురాములు, సర్పంచులు రమేష్ యాదవ్, వెంకటరామిరెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, వరలక్ష్మీ రాజేందర్రెడ్డి, నాగమణి లింగం గౌడ్, రఘు, ఎంపీటీసీ సభ్యులు అంబాజీ , రమేష్, రఘు నాయక్, సుధాకర్ రెడ్డి, నాయకులు జనార్దన్ రెడ్డి, రాములు, జంగయ్య, నరసింహ, శంకర్ జి, శ్రీనివాస్ రెడ్డి, ఎండి తాహీర్, యాదయ్య, శేఖర్ రెడ్డి, రంగారెడ్డి, పెంటా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.