అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు.

Update: 2024-09-04 11:49 GMT

దిశ, శంషాబాద్ : అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. శంషాబాద్ మండలం సీనియర్ నాయకులు నీరటి రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో పాలమాకుల గ్రామానికి చెందిన పీఏసీఎస్ చైర్మన్ శ్రవణ్ కుమార్ గౌడ్, డైరెక్టర్లు, మాజీ సర్పంచ్ సరిత రవీందర్ నాయక్, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులతో పాటు 200 మంది నాయకులు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరారు. పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువా వేసి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆహ్వానించారు.

     ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఆరు గ్యారెంటీలలో దాదాపు 5 అమలు చేశారన్నారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు కోటేశ్వర్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, కృష్ణ గౌడ్, ప్రవీణ్ కుమార్ గౌడ్, శ్రీధర్ గౌడ్, ప్రభాకర్ యాదవ్, ఆంజనేయులు యాదవ్, శ్రీశైలం గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, శివరాం నాయక్, జహంగీర్ ఖాన్, రవీందర్ యాదవ్, శేఖర్, ప్రవీణ్, కృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News