గ్రామాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి : డీఎస్పీ బాలకృష్ణారెడ్డి

తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి గురువారం పెద్దేముల్

Update: 2024-10-24 13:10 GMT

దిశ, పెద్దేముల్: తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి గురువారం పెద్దేముల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లోని రికార్డులను, పోలీస్ స్టేషన్ పనితీరును పరిశీలించారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్, సీసీ కెమెరాల పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్సై గిరి కి సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా గ్రామస్తులకు అవగాహన కల్పించాలని సూచించారు.


Similar News