పైపులైన్ లీకేజీతో తాగునీరు వృథా

త్రాగు నీటి పైపులైనుకు లీకేజీ ఏర్పడి పెద్ద ఎత్తున నీరు వృథా అవుతుండగా పట్టించుకునే వారే కరువయ్యారు.

Update: 2024-11-07 08:54 GMT

దిశ, యాచారం : త్రాగు నీటి పైపులైనుకు లీకేజీ ఏర్పడి పెద్ద ఎత్తున నీరు వృథా అవుతుండగా పట్టించుకునే వారే కరువయ్యారు. మండల కేంద్రంలోని మొండి గౌరెల్లి, రోడ్డున అంగన్వాడి కేంద్రం వద్ద పైపులైనుకు లీకేజీ ఏర్పడి 15 రోజులుగా త్రాగునీరు వృథా అవుతోంది. అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. యాచారం గ్రామానికి మిషన్ భగీరథ తాగునీటి సరఫరాను నామమాత్రంగా వదులుతున్నారని విమర్శలు వ్యక్తం అవుతుండగా అంగన్వాడి కేంద్రం వద్ద పైపులైన్లు లీకై త్రాగు నీరు వృథా అవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా లీకేజీల వద్ద పైపులైన్లకు మరమ్మతులు చేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన తాగునీరును అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


Similar News