అధికారం కోసం ఆరాటపడే బీజేపీ, కాంగ్రెస్ లను నమ్మొద్దు : అంజయ్య యాదవ్

అధికారం కోసం ఆరాటపడే ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మొద్దని మోసపూరిత మాటలను నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచుతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ ప్రజలను కోరారు.

Update: 2023-11-09 13:08 GMT

దిశ,షాద్ నగర్ : అధికారం కోసం ఆరాటపడే ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మొద్దని మోసపూరిత మాటలను నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచుతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ ప్రజలను కోరారు. గురువారం కొందుర్గు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని, ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలను అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి సంక్షేమానికి కృషి చేశారని అన్నారు.

ప్రతిపక్ష పార్టీలు అధికారం కోసం తాపత్రయ పడుతున్నాయని, మభ్య పెట్టే మాటలు నమ్మరాదని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు కేటాయించడం లేదని సామాన్య ప్రజల సమస్యలు పరిష్కరించలేని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం చేస్తామంటూ ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో ప్రజలు అనేక అవస్థలు పడ్డారని అవినీతి అక్రమాలు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఏం లేదని అన్నారు. తొమ్మిదేళ్ళలో ఎంత అభివృద్ధి చెందిందో గ్రహించాలని, అబివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News