రక్తదానం ప్రాణదానంతో సమానం.. అదనపు కలెక్టర్ సబవత్ మోతిలాల్

Update: 2024-08-15 12:55 GMT

దిశ, తాండూర్ : రక్తదానం.. ప్రాణదానంతో సమానమని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ సబవత్ మోతిలాల్ అన్నారు. తాండూర్ రెవెన్యూ శాఖ, మంచిర్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక సురభి గోద్రక్షేత్ర ఫంక్షన్ హాల్ లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్త దానం చేయడం వలన ఆపదలో ఉన్న ఎందరికో ప్రాణదానం చేసినట్టు అవుతుందన్నారు. బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ మాట్లాడుతూ 18 నుంచి 60 వయస్సు ఉన్న ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరు రక్తదానం చేయవచ్చన్నారు. రక్తదానంపై అపోహలను వీడనాడి రక్తదానం చేసినందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదాతలకు అదనపు కలెక్టర్, ఆర్ డి ఓ సర్టిఫికెట్లను అందజేశారు. శిబిరంలో 201 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జి, విద్యా భారతి విద్యాసంస్థల డైరెక్టర్ సురభి శరత్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో తహసిల్దార్ ఇమ్రాన్ ఖాన్, ఎంపీడీవో శ్రీనివాస్, నాయబ్ తహసిల్దార్ ప్రసాద్, ఎంఈఓ ప్రభాకర్ నాయకులు రవీందర్ రెడ్డి, మురళీధర్ రావు, శంకర్, ఎండి ఈసా, విద్యా భారతి విద్యాసంస్థల వ్యవస్థాపకులు సురభి ఆగమ రావు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News