దిశ ఎఫెక్ట్ : అక్రమ నిర్మాణంపై అధికారులు నోటీసులు
దిశ దినపత్రికలో వరుసగా అనుమతులు లేని సిమెంట్ మిక్సర్ ప్లాంట్ అనే శీర్షికతో వచ్చిన కథనానికి పంచాయతీ కార్యదర్శి సజన స్పందించి కార్యకలాపాలు జరుపవద్దని రెండోసారి నోటీసులు అందజేశారు
దిశ, చేవెళ్ల : దిశ దినపత్రికలో వరుసగా అనుమతులు లేని సిమెంట్ మిక్సర్ ప్లాంట్ అనే శీర్షికతో వచ్చిన కథనానికి పంచాయతీ కార్యదర్శి సజన స్పందించి కార్యకలాపాలు జరుపవద్దని రెండోసారి నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అనుమతి లేని సిమెంట్ మిక్సర్ ప్లాంట్ లో కార్యకలాపాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాముని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కారోబార్ బీంరాజ్ తదితరులు పాల్గొన్నారు.