శేరిలింగంపల్లిలో అత్యధికం.. కొడంగల్‌‌లో అతితక్కువ

మూడు రోజుల పాటు రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాల్లో జరిగిన మద్యం అమ్మకాల్లో రూ.116కోట్ల ఆదాయం ఎక్సైజ్​ శాఖకు వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి...

Update: 2025-01-02 02:30 GMT

దిశ, రంగారెడ్డి బ్యూరో: ​2024 సంవత్సరానికి వీడ్కోలు​ చెబుతూ.. 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జిల్లాలో సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాల్లో మూడు రోజుల పాటు జరిగిన మద్యం అమ్మకాల్లో రూ.116కోట్ల ఆదాయం ఎక్సైజ్​ శాఖకు వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 93,725 లిక్కర్​.. 1,18,447 బీర్​ కేసులు విక్రయించారు. కానీ గతేడాది ఈ మూడు రోజుల్లో రూ.117.32 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయి. 98,266 లిక్కర్​.. 1,03,538 బీర్ల కేసులు సేల్​ చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2023 డిసెంబర్​ 29, 30, 31వ తేదీల్లో, 2024 డిసెంబర్​ 29, 30, 31వ తేదీల్లో విక్రయించిన మద్యం సేల్‌‌తో పోలిస్తే రూ.1కోటి 12లక్షల ఆదాయం నష్టం వచ్చినట్లు తెలుస్తున్నది.

శంషాబాద్​ సర్కిల్లోనే అత్యధిక ఆదాయం..

రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లా్లో మూడు ఎక్సైజ్​ సర్కిల్లున్నాయి. అవి సరూర్ ​నగర్​, శంషాబాద్​, వికారాబాద్​ సర్కిళ్లు కాగా.. వీటి పరిధిలో 14 పోలీస్​ స్టేషన్లున్నాయి. శంషాబాద్​ సర్కిల్​‌లో మూడు పోలీస్​ స్టేషన్లుండగా శంషాబాద్​, శేరిలింగంపల్లి పూర్తిగా అర్బన్, చేవెళ్ల రూరల్​​ ప్రాంతంలోనే ఉన్నాయి. అయితే అర్బన్​ ప్రాంతాలైన శేరిలింగంపల్లి, శంషాబాద్​ పోలీస్ స్టేషన్​ పరిధిలోని మద్యం షాపుల్లో విక్రయాలు జోరుగా జరిగినట్లు తెలుస్తున్నది. శంషాబాద్​ సర్కిల్​ పరిధిలో 41,414 లిక్కర్​, 53337 బీర్​ కేసులు విక్రయిస్తే రూ.56.77కోట్ల ఆదాయం ఎక్సైజ్​ శాఖకు వచ్చింది. కానీ ఒక్క శేరిలింగంపల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలోనే 18,766 లిక్కర్​.. 25,503 బీర్​ కేసులు విక్రయిస్తే రూ.28.69 కోట్లు వచ్చింది. ఈ స్టేషన్​ పరిధిలో లిక్కర్​ కంటే బీర్​ కేసులు అత్యధికంగా విక్రయించినట్లు తెలుస్తున్నది. సరూర్​ నగర్​ సర్కిల్​ పరిధిలో ఆరు పోలీస్ స్టేషన్లుండగా.. సరూర్​ నగర్​, హయత్​ నగర్​, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, అమన్గల్​, షాద్​ నగర్​ పరిధిలోనే ఉన్నాయి. అయితే ఈ సర్కిల్​ పరిధిలో సరూర్ నగర్​ తప్పా మిగిలిన ఐదు పోలిస్​ స్టేషన్లు రూరల్​ ప్రాంతంలోనే ఉన్నాయి. 42,563 లిక్కర్​.. 49,966 బీర్​ కేసులు విక్రయిస్తే రూ.49.58 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందని లెక్కలు చెబుతున్నాయి. వికారాబాద్​ సర్కిల్​ పరిధిలో వికారాబాద్​, పరిగి, తాండూర్​, మోమిన్​ పేట్​, కొడంగల్​ పోలీస్​ స్టేషన్లున్నాయి. ఈ సర్కిల్ పరిధిలో 9748 లిక్కర్​.. 15,144 బీర్​ కేసులు విక్రయిస్తే కేవలం రూ.9.75 కోట్ల ఆదాయంతో సర్ధుకున్నారు. కానీ అదే సీఎం నియోజకవర్గమైన కొడంగల్​ ఎక్సైజ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో 1026 లిక్కర్​.. 2255 బీర్​ కేసులు విక్రయిస్తే రూ.1.13 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే లిక్కర్​ 4 శాతం సేల్​ తగ్గింది. కానీ 28శాతం బీర్ల​ విక్రయం పెరిగింది.

తగ్గిన ఎక్సైజ్​ ఆదాయం..

రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్​ అధికారులు ఆశించిన స్థాయిలో డిసెంబర్​ 29, 30, 31వ తేదీల్లో ఆదాయం రాలేదనే చర్చ సాగుతున్నది. సాధారణంగా రోజువారీగా వచ్చే ఆదాయంలాగే నూతన సంవత్సర వేడుకలు జరిగినట్లు తెలుస్తున్నది. పెద్దగా మద్యం సేల్​ లేదని లెక్కలు చెబుతున్నాయి. రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలు నగరానికి అతి దగ్గరలో ఉన్నందున ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు, వివిధ రంగాల్లో పనిచేసే వ్యక్తులు గెట్​ టు గెదర్​ పార్టీలు పెట్టుకుంటారు. కానీ ఈ ఏడాది వేడుకలు భారీగా జరిగినట్లు కనిపించినా మద్యం సేల్​ పెద్దగా లేదని తెలుస్తున్నది. అంతేకాకుండా దసరా పండుగ సందర్భంగా జరిగిన సేల్‌ను కూడా దాటలేదని అధికారులు అంచనాలు వేస్తున్నారు.


Similar News