ఇజ్తేమా గాహ్ కార్యక్రమ ప్రదేశాలను సందర్శించిన చేవెళ్ల ఎమ్మెల్యే

శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని జంబోరి మైదానంలో నిర్వహిస్తున్న ఇజ్తేమా గాహ్ కార్యక్రమంలో భాగంగా శనివారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సందర్శించారు.

Update: 2025-01-04 10:29 GMT

దిశ, శంకర్ పల్లి : శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని జంబోరి మైదానంలో నిర్వహిస్తున్న ఇజ్తేమా గాహ్ కార్యక్రమంలో భాగంగా శనివారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సందర్శించారు. మత పెద్దలతో సమావేశమై కార్యక్రమం నిర్వహిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. శనివారం ప్రారంభమైన ఇజ్తేమా గాహ్ కార్యక్రమం ఆదివారం సాయంత్రం తో ముగుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఏ ప్రాంతాలకు చెందినవారు పాల్గొన్నారు అనే విషయాలపై మత పెద్దలతో అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఇక్కడ ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. వైద్య ఆరోగ్యం కోసం ఏర్పాటుచేసిన ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. కొంతమంది అస్వస్థకు గురైన వారికి వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కేంద్రం ఇన్చార్జి చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ, నార్సింగ్ ఏసిపి రమణ గౌడ్ తో సమావేశమై ఆదివారం సాయంత్రం ముగుస్తున్నందున వెళ్లే సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళిక బద్ధంగా అందరూ వెళ్లేందుకు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందే ప్రణాళిక సిద్ధం చేశామని ఆ విధంగానే పంపిస్తామని ఏసీపీ రమణ గౌడ్ చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సురేందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్, శ్రీనివాస్ గౌడ్, పొద్దుటూరు మాజీ ఎంపీటీసీ బొల్లారం వెంకటరెడ్డి, శంకర్పల్లి మాజీ ఉపసర్పంచ్ సాత ప్రవీణ్ కుమార్, శంకర్పల్లి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బొల్లారం ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Similar News