వార్త సేకరణలో దిశ పత్రిక ఇతరులకు ఆదర్శం

వార్తల సేకరణలో దిశ ఇతరులకు ఆదర్శం అని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అన్నారు.

Update: 2025-01-02 13:15 GMT

దిశ, ఆమనగల్లు ::- వార్తల సేకరణలో దిశ ఇతరులకు ఆదర్శం అని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం కడ్తాల్ పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో కలిసి ఆయన దిశ 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ… ప్రజా సమస్యల పరిష్కారానికి దిశలో ప్రచురితమవుతున్న కథనాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో దినపత్రిక ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు దశరత్ నాయక్, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేష్, మండల అధ్యక్షులు పరమేష్, మాజీ సర్పంచ్ లక్ష్మి నర్సింహా రెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నిర్మల శ్రీశైలం,తదితరులు పాల్గొన్నారు.


Similar News