ప్రగతిని చాటేలా రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు: ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రగతిని చాటేలా రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు.

Update: 2023-05-30 15:06 GMT

దిశ, బొంరాస్ పేట్: తెలంగాణ రాష్ట్ర ప్రగతిని చాటేలా రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు నిర్వహిస్తామని  ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాల్గొని  మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జిల్లాలో అన్ని రంగాల్లో జరిగిన ప్రగతి చాటేలా ఘనంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలకు త్రాగునీరు, విద్యుత్ వంటి కనీస మౌలిక వసతులు కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 9 సంవత్సరాల పాలన ముగిసే నాటికి అన్ని రంగాల్లో సమూల మార్పులు సాధించామని అన్నారు.

నీటి పారుదల రంగంలో సాధించిన ప్రగతికి ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయని, కరెంట్ కష్టాలతో ఇబ్బంది పడ్డ తెలంగాణ నేడు 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హేమిబాయి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు చాంద్ పాష, పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీలు నారాయణరెడ్డి, సుదర్శన్ రెడ్డి, రైతు సమితి అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, యాదగిరి, టి.టి. రాములు, రవిగౌడ్, నరసింహ నాయక్, నెహ్రూ నాయక్, ఎంఈవో రాంరెడ్డి, ఎంపీడీవో పాండునాయక్, ఎమ్మార్వో భీమయ్యగౌడ్డి, డిప్యూటీ తాసిల్దార్ రవి, ఆర్ఐ రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News