రైతులకు కన్నీరు మిగిల్చిన ఈదురు గాలులు..

మాడ్గుల మండల పరిధిలోని అన్న బోయినపల్లి, బ్రాహ్మణపల్లి, ఆర్కపల్లి, ఇర్విన్ గ్రామాలతో పాటు సమీప తండాలలో వేసిన మొక్కజొన్న పంటలు శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి ప్రాథమిక అంచనా ప్రకారం 357 ఎకరాలలో నష్టం వాటిల్లినట్లు మండల వ్యవసాయ అధికారి అరుణ కుమారి ఆదివారం తెలిపారు.

Update: 2025-03-23 06:39 GMT
రైతులకు కన్నీరు మిగిల్చిన ఈదురు గాలులు..
  • whatsapp icon

దిశ, మాడ్గుల : మాడ్గుల మండల పరిధిలోని అన్న బోయినపల్లి, బ్రాహ్మణపల్లి, ఆర్కపల్లి, ఇర్విన్ గ్రామాలతో పాటు సమీప తండాలలో వేసిన మొక్కజొన్న పంటలు శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి ప్రాథమిక అంచనా ప్రకారం 357 ఎకరాలలో నష్టం వాటిల్లినట్లు మండల వ్యవసాయ అధికారి అరుణ కుమారి ఆదివారం తెలిపారు. సోమవారం వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి నష్టపోయిన పంటల వివరాలను సేకరించనున్నట్లు ఆమె తెలిపారు. చేతికి వచ్చిన మొక్కజొన్న పంటలు ఈదురు గాలులతో కురిసిన వర్షానికి దెబ్బ తినడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం సహాయం అందించి ఆదుకోవాలని మండల రైతులు కోరుతున్నారు.

Similar News