రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే : మనోహర్ రెడ్డి
రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పదేళ్లుగా అధికారంలో ఉన్న ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయని బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని తాండూరు కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి అన్నారు.
దిశ, యాలాల : రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పదేళ్లుగా అధికారంలో ఉన్న ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయని బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని తాండూరు కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి అన్నారు. మండలంలోని సంగెం కుర్దు, హాజీపూర్, కిష్టాపూర్, దేవనూర్, దుబ్బతండా, దేవులతండా, విశ్వనాథ్ పూర్, గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో సమస్యలను పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే సంక్షేమ పథకాలు అమలయ్యాయని తెలిపారు.
ఇప్పటి వరకు ఒక్క రేషన్ కార్డు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కొత్త పింఛన్లను మంజూరు చేయని బీఆర్ఎస్ బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీల పైన మొదటి సంతకం పెడతామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాండూరు నియోజకవర్గం అసలు అభివృద్ధికి నోచుకోలేదని తాండూరులో గత పాలకులు యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి యువకులను మోసం చేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే తాండూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని కోరారు. ఈ కార్యక్రమంలో సంపత్ కుమార్ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి పీఎసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు భీమయ్య, సీనియర్ నాయకులు హన్మంతు, ముదిరాజ్, కలాల్ చంద్రశేఖర్ గౌడ్ ఉన్నారు.