ఇల్లు ఖాళీ చేయాలనే విషయంలో ఇరువురికి ఘర్షణ.. కర్రలతో దాడి

అద్దెకు ఉంటున్న ఇంటిని ఖాళీ చేయలేదని కిరాయికి

Update: 2024-11-11 05:36 GMT

దిశ,శంషాబాద్ : అద్దెకు ఉంటున్న ఇంటిని ఖాళీ చేయలేదని కిరాయికి ఉంటున్న వారిపై ఇంటి యజమాని దాడి చేసిన ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హసన్ నగర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అసర్ నగర్ కు చెందిన ఆమె ఇల్లును గత ఏడాది క్రితం కుదవబెట్టి రూ.ఐదు లక్షలు అప్పుగా తీసుకుంది. కుదవ పెట్టి ఇంటిని అప్రోజ్ అతని అత్త హైమద్ బేగంకు కిరాయికి ఇచ్చాడు. ఇంటి యజమాని జహంగీర్ బి అప్రోజ్ దగ్గర తీసుకున్న రూ. 5 లక్షలలో నాలుగు లక్షల 50 వేలు  తిరిగి ఇచ్చింది.

అయితే ఇంకా మిగిలిన రూ.50 వేలు ఇవ్వాలని అప్రోజ్, జహంగీర్ బి పై ఒత్తిడి తేవడంతో నా ఇంట్లో డోర్లు మిగతా సామాన్లన్నీ విరిగిపోయాయి, వాటిని రిపేర్ చేసి ఇస్తేనే డబ్బులు ఇస్తానని చెప్పింది. దీంతో ఇంట్లో కిరాయికి ఉంటున్న హైమద్ బేగం లో ఇంటిని ఖాళీ చేయాలని చెప్పడంతో ఆమె ఇంటిని ఖాళీ చేయలేదు. ఇంటి ఓనర్ జహంగీర్ కొడుకు వచ్చి కరెంటు కట్ చేసిన ఖాళీ చేయకపోవడంతో ఇంటిని ఖాళీ చేయాలని ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఇరువర్గాలు కట్టెలు రాళ్లతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలపై కేసులు నమోదు చేశామన్నారు.


Similar News