ఆరు గ్యారంటీల అమలులో సీఎం రేవంత్ రెడ్డి విఫలం : హరీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలను బంద్ పెట్టి మూసీ దుకాణాన్ని ముందు పెట్టాడని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు.

Update: 2024-11-18 12:16 GMT

దిశ, తుర్కయంజాల్ : సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలను బంద్ పెట్టి మూసీ దుకాణాన్ని ముందు పెట్టాడని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. సోమవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని జేబీ గ్రౌండ్ లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాధవరం నరసింహా రావు ఆధ్వర్యంలో తెలంగాణ అమర వీరుల స్మారక క్రికెట్ టోర్నమెంట్ (తెలంగాణ ఛాంపియన్స్ ట్రోఫీ) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హరీష్ రావు, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి లు మాట్లాడుతూ… కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఆగం చేస్తుండని అన్నారు. నిరుపేదలు కట్టుకున్న ఇండ్లను హైడ్రా పేరుతో కూల్చివేసి రోడ్డున పడేశారని అన్నారు.

మూసీ ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఇండ్లు కూల్చితే సహించేది లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా అవిఫలమయ్యారన్నారు. విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా కాలం గడుపుతూ వస్తుందన్నారు. యువకులు క్రికెట్ క్రీడల్లో రాణించి ఇండియా టీమ్ లో ఆడేందుకు అభివృద్ధి చెందాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడ్డాయని అన్నారు. అనంతరం క్రికెట్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ జగన్ మోహన్ రావు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సత్తు వెంకట రమణారెడ్డి, కందాడ లక్ష్మారెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, కొండ్రు ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.


Similar News