తవ్వే కొద్ది వెలుగులోకి బుక్ కీపర్ అక్రమాలు
మహిళ స్వయం సంఘాలకు ఆర్థికంగా భరోసా కల్పించాల్సిన బుక్ కీపర్, అక్రమాల పుట్ట ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం బ్యాంకు మేనేజర్ పాత్రపైన అనుమానాలు వ్యక్తమవుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది.
దిశ, యాచారం : మహిళ స్వయం సంఘాలకు ఆర్థికంగా భరోసా కల్పించాల్సిన బుక్ కీపర్, అక్రమాల పుట్ట ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం బ్యాంకు మేనేజర్ పాత్రపైన అనుమానాలు వ్యక్తమవుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. మండల పరిధిలోని మల్కిస్ గూడా, గ్రామంలోని ఇందిరా గ్రూప్ సభ్యుల ఫిర్యాదు మేరకు ఏపిఎం సుదర్శన్ రెడ్డి, సీసీ జంగయ్య, ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ ఝాన్సీ రాణి, డ్వాక్రా భవనంలో సోమవారం విచారణ చేపట్టారు. ఇందిరా గ్రూపులో 15 మంది సభ్యులు ఉండగా వయసు మీద పడి 8 మంది అర్హత కోల్పోగా 4గురు మహిళలు మాత్రమే రుణం పొందారని మిగతా వారి స్థానంలో గ్రూపుకు సంబంధం లేని వేరే గ్రామాలకు చెందిన అమీర్పేట శ్రీలత, ఆలంకుంట శ్రీదేవి, నాగిళ్ల లక్ష్మమ్మ, రెడ్డి మోని కమలమ్మ, డేరంగుల మౌనిక, శ్రీలత, లక్ష్మమ్మ,లకు ఫోర్జరీ సంతకాలతో 20 లక్షల రూపాయల రుణం మంజూరు చేశారని, బ్యాంకు మేనేజర్ వారి ఖాతాలకు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారని మహిళలు నిలదీశారు.
గులాబీ, శ్రీవల్లి, అజంతా, ఝాన్సీ రాణి, లక్ష్మీ సరస్వతి, గ్రూపులలోని మహిళలకు తెలియకుండానే తీర్మానాలు లేకుండానే రుణాలు ఇతరులకు మంజూరు చేసినట్లు అధికారుల దృష్టికి మహిళలు తీసుకువచ్చారు. రుణాలు తీసుకున్న సభ్యులు చనిపోతే రుణాలు కట్టొద్దని ప్రభుత్వాలు చెబుతున్న నాలుగేళ్లుగా చెల్లిస్తున్నామని ఆ డబ్బులు ఎక్కడికి పోయాయని నిలదీశారు. కలెక్టరుకు, ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదని కేసులు పెట్టారని గ్రామస్తులు మండిపడ్డారు. విబికే రాణి, కుటుంబ సభ్యులు రుణాలు ఇతరుల ఖాతాలకు మళ్లించింది వాస్తవమేనని 2 నెలలలో చెల్లిస్తామని అధికారుల దృష్టికి, తీసుకురాగా.. 27 గ్రూపులలో అవినీతి జరిగిందని, ఐదేళ్లుగా చెల్లించిన రుణాల బ్యాంకు స్టేట్ మెంట్ ను పరిశీలించాలని కోటి రూపాయల వరకు అక్రమాలు జరిగాయని ఇందుకు కారణమైన విబికే రాణి, బ్యాంకు మేనేజర్, చట్టపరమైన చర్యలు తీసుకొని డబ్బులను రికవరీ చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. ఏపిఎం సుదర్శన్ రెడ్డి, గ్రామంలోని అన్ని గ్రూపుల సభ్యులతో మాట్లాడి విచారణ జరిపి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, మహిళా సంఘాల గ్రూప్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.