Missing : చుక్కాపూర్ వృద్ధుడు హైదరాబాద్ లో మిస్సింగ్..

రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలానికి చెందిన చుక్కాపూర్ గ్రామపంచాయతీలోని మల్లెల నరసింహ (65) అనే వృద్ధుడు సెప్టెంబర్ 2న సీబీఎస్ బస్ డిపో సమీపంలో తప్పిపోయాడు.

Update: 2024-10-28 07:22 GMT

దిశ, తలకొండపల్లి : రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలానికి చెందిన చుక్కాపూర్ గ్రామపంచాయతీలోని మల్లెల నరసింహ (65) అనే వృద్ధుడు సెప్టెంబర్ 2న సీబీఎస్ బస్ డిపో సమీపంలో తప్పిపోయాడు. వెంటనే తన కూతురు ఎక్కడ వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో చివరకు అఫ్జల్గంజ్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. సుమారు రెండు నెలలు కావస్తుండడంతో నరసింహ కుటుంబ సభ్యులు, భార్య పిల్లలు ప్రతినిత్యం అతని కోసం వెతుకుతూ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.

తప్పిపోయిన నరసింహకు కొద్ది రోజులుగా మతిస్థిమితం సరిగ్గా లేదని తప్పిపోయిన సమయంలో అయ్యప్ప స్వామి నల్ల కలర్ లుంగీ, మెరూన్ షర్టు ధరించి ఉన్నాడని తెలిపారు. పొట్టిగా, నల్లగా ఉంటాడని అతనితో ఎవరైనా మాట్లాడినా కూడా అతని పేరు నరసింహ, గ్రామం పేరు చుక్కాపూర్ అని మాత్రమే చెప్పగలడని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. తప్పిపోయిన వృద్ధుడు హైదరాబాదులోనే ఎక్కడో ఒకచోట ఉన్నాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా ఎవరికైనా వృద్ధుడు కనిపిస్తే వారి కుటుంబ సభ్యులకు లేదా అఫ్జల్గంజ్ పీఎస్ కు 9121779507, 9949623996 సమాచారం ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు.

Tags:    

Similar News