కొండెక్కిన కోడి.. కార్తీక మాసం ముగియడంతో భారీగా పెరిగిన ధరలు
కోడి కూర ధర కొండెక్కి కూర్చుంది. నిన్నామొన్నటి వరకు కిలో చికెన్ రూ 130కే దొరకగా, ఇప్పుడు మండల కేంద్రంలో రూ 200 వరకు చేరుకుంది.
దిశ, యాచారం : కోడి కూర ధర కొండెక్కి కూర్చుంది. నిన్నామొన్నటి వరకు కిలో చికెన్ రూ.130కే దొరకగా, ఇప్పుడు మండల కేంద్రంలో రూ.200 వరకు చేరుకుంది. కార్తీక మాసంలో అమాంతం ధరలు తగ్గి సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు కార్తీక మాసం ముగియడంతో నిన్నటి వరకు రూ.130కే దొరికిన చికెన్.. ఇప్పుడు ఒక్కసారిగా డబుల్ అయ్యింది. కార్తీక మాసం ముగియడం, మాంసం ప్రియులు చికెన్ సెంటర్లకు క్యూ కట్టడంతో ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. పెళ్లిళ్ల సీజన్ మొదలై క్రిస్టమస్, న్యూ ఇయర్ వేడుకలు, ఇతర పండుగలు ముందు ఉండడంతో చికెన్‌కు డిమాండ్ మరింత పెరగనుంది. రూ.70 నుంచి రూ. 80 వరకు ఒక కిలో మీద పెరగడంతో మాంసం ప్రియులు షాక్‌కు గురవుతున్నారు. ఒక్కసారిగా కూరగాయల ధరలు, దానికి తోడు చికెన్ ధరలు కూడా అమాంతం పెరగడంతో నిట్టూరుస్తున్నారు.