తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ దే..

కేంద్రప్రభుత్వం గిరిజన సంస్కృతిని విస్మరిస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల అభివృద్ధికి పెద్ద పీఠ వేశారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

Update: 2023-03-05 12:42 GMT

దిశ, మీర్ పేట్ : కేంద్రప్రభుత్వం గిరిజన సంస్కృతిని విస్మరిస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల అభివృద్ధికి పెద్ద పీఠ వేశారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మిథిలానగర్ లో ఆదివారం ఏర్పాటుచేసిన సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. గతంలో ఎవరు పట్టించుకోలేదని ఆమె పేర్కొన్నారు.

గిరిజనుల ఆత్మగౌరవం కోసం బంజారాహిల్స్ లో బంజారా భవనం నిర్మించారన్నారు. సేవాలాల్ మహారాజ్ నడియాడిన నేలపైనే ఈ గిరిజన భవనం నిర్మాణం చేశామని తెలిపారు. సేవాలాల్ ఆశయం కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలన్నారు. మహేశ్వరంలో సేవాలాల్ మహారాజ్ భవనం కోసం 2 కోట్లతో నూతన భవనం నిర్మాణం చేస్తామని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలోని గుర్రం గూడా, లెనిన్ నగర్ తదితరుల ప్రాంతాల్లో సేవాలాల్ భవన నిర్మాణాలకు స్థలం కేటాయించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ యం.దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, కార్పొరేటర్లు అర్కల భూపాల్ రెడ్డి, నరేందర్ కుమార్, కో ఆప్షన్ సభ్యులు, గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News