సామాజిక సాధికారత కోసమే కుల గణన సర్వే : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

సమాజంలో వేళ్ళూనుకున్న కుల రక్కసి కోరలు పీకి ఆయా వర్గాల

Update: 2024-11-06 11:15 GMT

దిశ,కేశంపేట: సమాజంలో వేళ్ళూనుకున్న కుల రక్కసి కోరలు పీకి ఆయా వర్గాల వారికి సామాజిక న్యాయం చేయడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన సర్వేను చేపట్టిందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం కేశంపేట మండల పరిధిలోని పోమాలపల్లి గ్రామంలో సామాజిక,ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల ,సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ఎమ్మెల్యే ప్రారంభించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటూ వస్తుందని అందులో భాగంగా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు కుల గణన సర్వేను చేపట్టిందన్నారు. కుల గణన పై గతంలో చాలామంది మాట్లాడారే తప్ప ఆచరణలోకి తీసుకురాలేక పోయారన్నారు.

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే దానిని చేతల్లో చూపించే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా కులగరణ సర్వే లో పాల్గొని సర్వేకు సహకరించాలని ఆయన కోరారు. అంతకు ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రాజారత్నం,తహసీల్దార్ ఆజం అలీ, ఇన్చార్జి ఎంపీడీవో రవిచంద్ర కుమార్ రెడ్డి,మాజీ జడ్పీటీసీ తాండ్ర విశాఖ శ్రవణ్ రెడ్డి,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గూడ వీరేశం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్వర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భాస్కర్ గౌడ్, నాయకులు పల్లె ఆనంద్,కృష్ణయ్య,అనుమగల్ల రమేష్,సురేష్ రెడ్డి,రావుల పెంటయ్య, అధికారులు ఎంపీఓ కిష్టయ్య,పీఆర్ ఏఈ నర్సింగ్ రావు, ఏఓ శిరీష తదితరులు పాల్గొన్నారు.


Similar News