ప్రతి ఓటర్ను ఓటు అడగాలి.. డోకూరు ప్రభాకర్ రెడ్డి
కల్వకుర్తిలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఈ 15 రోజులు అత్యంత విలువైన సమయమని, ప్రతి కార్యకర్త ప్రతి గడపను తట్టి ఓటు అభ్యర్థించాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డోకూరు ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.
దిశ, తలకొండపల్లి : కల్వకుర్తిలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఈ 15 రోజులు అత్యంత విలువైన సమయమని, ప్రతి కార్యకర్త ప్రతి గడపను తట్టి ఓటు అభ్యర్థించాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డోకూరు ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని మాదాయపల్లి పంచాయతీలో బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం గడపగడపకు ప్రచార కార్యక్రమాన్ని స్థానిక కార్యకర్తలతో కలిసి ప్రారంభించారు. అనంతరం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ఒక అభ్యర్థిలా భావించి కాంగ్రెస్ గెలుపునకు కంకణం కట్టుకొని గ్రామంలోని అందరినీ కలసి ఓట్లు అడగాలని కోరారు.
ఇప్పటికే కల్వకుర్తి నుండి మూడుసార్లు గెలుపొందిన జైపాల్ యాదవ్ అసమర్థతను, వ్యతిరేకతను ప్రజలకు వివరిస్తూ సొమ్ము చేసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ మూడో తేదీన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని, కష్టపడ్డ ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తించి సముచిత స్థానం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెల్జాల్ ఎంపీటీసీ అంబాజీ, ఉపసర్పంచ్ అజీజ్, మైనార్టీ మండల అధ్యక్షుడు ఎండీ అరిఫ్, నాయకులు ఆయిల్ శ్రీనివాస్ గౌడ్, చిలుకమ్ ఆంజనేయులు, తుడుం భాస్కర్, రవికుమార్, లింగం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.