బీటెక్ విద్యార్థి మిస్సింగ్
ఇబ్రహీంపట్నం మండల కేంద్రం లో ని గురునానక్ కాలేజీలో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థి తప్పిపోయిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
దిశ, ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మండల కేంద్రం లో ని గురునానక్ కాలేజీలో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థి తప్పిపోయిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ కు చెందిన కొత్తగాడి బాల్రాజ్ (42), కుమారుడైన కొత్తగాడి విష్ణు (17), రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం పరిధిలోని గురునానక్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతూ హాస్టల్ లో ఉంటున్నాడు. కాగా విష్ణు కు ఈ నెల 14వ తేదీన తన తండ్రి ఫోన్ కాల్ చేసినా ఎత్తలేదు. అయితే మరుసటి రోజు 15న మళ్లీ కాల్ చేయగా తన స్నేహితుడు కుమారుడు 14వ తేదీ హాస్టల్ నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదని చెప్పాడు. విషయం తెలుసుకున్న తండ్రి ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజీకి వచ్చి తన కొడుకు రాలేడన్న విషయం తన స్నేహితులను అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత స్థానిక ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.