శంషాబాద్ విమానాశ్రయంలో విమానానికి బాంబు బెదిరింపు కాల్

శంషాబాద్ విమానాశ్రయం నుంచి చండీగల్ వెళ్లే విమానానికి బాంబు బెదిరింపు కాల్ తీవ్ర కలకలం రేపింది

Update: 2024-10-25 11:00 GMT

దిశ, శంషాబాద్ : శంషాబాద్ విమానాశ్రయం నుంచి చండీగల్ వెళ్లే విమానానికి బాంబు బెదిరింపు కాల్ తీవ్ర కలకలం రేపింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం 130 మంది ప్రయాణికులతో చండీగఢ్ వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. అప్పటికప్పుడు ఇండిగో విమానాన్ని పేల్చేస్తామని ఫోన్ కాల్ రావడంతో అప్రమత్తమైన శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు, సిఐఎస్ఎఫ్ పోలీసులు ఇండిగో విమానంలో ఉన్న 130 మంది ప్రయాణికులను హుటాహుటిన కిందకి దింపి డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. విమానాశ్రయంలో ఉన్న ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ విస్టారా ఎయిర్‌లైన్స్ లోను డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో అధికారులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాంబు ఉందంటూ వచ్చిన ఫోన్ కాల్ పై అధికారులు పోలీసులు విచారణ మొదలుపెట్టారు.


Similar News