ధరణిలో కనిపించని భూ నక్ష

దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ భూ రికార్డులను పూర్తిగా డిజిటలైజేషన్ చేశారు.

Update: 2024-10-03 13:25 GMT

దిశ, చేవెళ్ల : దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ భూ రికార్డులను పూర్తిగా డిజిటలైజేషన్ చేశారు. అదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా ధరణి పోర్టల్ ద్వారా భూమి మ్యాప్ లను ఆన్లైన్ అందుబాటులో ఉంచింది. ఇప్పుడు అయినా ఎవరైనా ఆన్లైన్ లో భూ రికార్డులు చూసుకోవచ్చు. కానీ చేవెళ్ల మండలంలోని న్యాలట గ్రామ భూ నక్ష మాత్రం కనిపించడం లేదు. ఆన్లైన్ లో ధరణి పోర్టల్ లో న్యాలట గ్రామ భూ నక్ష చూస్తే నో డేటా అవైలబుల్ అని చూపిస్తుంది. కొత్తగా భూములు కొనుగోలు చేసే వారు ఇబ్బంది పడుతున్నారు.

ఆన్లైన్ లో భూ రికార్డులు కనిపిస్తున్నాయి. కానీ భూ నక్ష సర్వే నెంబర్ మ్యాప్ మాత్రం కనిపించడం లేదు. న్యాలట పక్క గ్రామాల భూ నక్ష కనిపిస్తుంది. న్యాలట గ్రామ నక్ష కనిపించడం లేదు. దీంతో భూములు కొనుగోలు చేసే రియల్ వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో భూమి ఇక్కడ చూపి అమ్మితే సర్వే నెంబర్ వేరే దగ్గర ఉండేది. గతంలో ఇలాంటి సమస్యలు చాలానే ఉండేవి. ధరణి వచ్చిన తర్వాత ఇలాంటి సమస్య ఇక్కడ కనిపించదు. కానీ న్యాలట గ్రామంలో మాత్రం ఇలాంటి భూ సమస్య తలెత్తేలా ఉన్నాయి. భూ నక్ష ఆన్లైన్ లో కనిపించకపోవడంతో అ గ్రామ రెవిన్యూ లో ఏమైనా జరుగుతుందా అని సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా అనుమతులు లేని వెంచర్ గాని భూ రికార్డులు మార్పులు కూడా జరుగుతున్నాయా.. లేక ఆన్లైన్ చేసేటప్పుడు గ్రామ నక్ష రెవెన్యూ అధికారులు అందించలేదా!అని గ్రామస్థులు సందేహాలు మొదలయ్యాయి. స్థానికంగా ఉన్న బడా నేతలు కావాలనే భూ నక్ష కనిపించకుండా చేశారు అనే ఆరోపణలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు తొందరగా ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు.

ప్రాబ్లం ఏమి ఉండదు : తహసీల్దార్ కృష్ణయ్య

ధరణి పోర్టల్ లో ఎంట్రీ చేసిన్నపుడు చేయన్నటుఉన్నారు.మ్యాప్ కనిపించకపోతే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు.భూ రికార్డులు, భద్రంగానే ఉంటాయి.


Similar News