రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ ప్రతీక్ జైన్

ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని

Update: 2024-11-09 03:12 GMT

దిశ,పెద్దేముల్ : ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శుక్రవారం పెద్దేముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ప్రతి రోజూ ప్రభుత్వ ఆస్పత్రికి ఎంతమంది రోగులు వస్తున్నారని సిబ్బందికీ అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. ఆసుపత్రిలోని పలు రిజిస్టర్లను రోగనిర్ధారణ ల్యాబ్, ఫార్మసీ, తదితరాలను పరిశీలించారు.

ఆరోగ్య కేంద్రంలో ఏదైనా వసతులు అవసరం ఉంటే ఏర్పాటు చేయాలని ఎంపీడీవో ను సూచించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మంచి నీటిని అందించాలని సూచించారు. ఆసుపత్రి భవనం లో ఏదైనా మరమ్మతులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని ఎంపీడీవో జర్నప్పకు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానకు వచ్చే నిరుపేద రోగులకు వైద్యులు అందుబాటులో ఉండి వైద్య మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలలో ప్రభుత్వ మెరుగైన సేవలను అందించడానికి కృషి చేస్తుందని అందరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిక్ జైన్ తో పాటు డీపీఆర్ఓ చెన్నమ్మ, పెద్దేముల్ ఎంపీడీవో జర్నప్ప, ఏం,ఎల్,హెచ్,పి డాక్టర్ ప్రమోద్, పెద్దేముల్ పీహెచ్ సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Similar News