ఆర్గానిక్​ పంటలతో ఆరోగ్యం మెరుగు

ఆర్గానిక్​ పంటలతో ఆరోగ్యం మెరుగుపడుతుందని వికారాబాద్​ జిల్లా కలెక్టర్​ ప్రతీక్​ జైన్​ అన్నారు.

Update: 2024-09-25 14:19 GMT

దిశ, పరిగి : ఆర్గానిక్​ పంటలతో ఆరోగ్యం మెరుగుపడుతుందని వికారాబాద్​ జిల్లా కలెక్టర్​ ప్రతీక్​ జైన్​ అన్నారు. పరిగి మండలం నజీరాబాద్​–హనుమాన్​ గండి శివారులో వాసన్​ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పండిస్తున్న ఆర్గానిక్ పంటల సాగు విధానాన్ని బుధవారం కలెక్టర్​ ప్రతీక్​ జైన్​ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలాంటి మందులు లేకుండా ఆర్గానిక్​ సాగు చేస్తున్న వరి, కూరగాయలు, చిరుధాన్యాల పంటలను పరిశీలించారు.

     అనంతరం అక్కడ ఉన్న రైతులను పంటలు సాగు వివరాలు అడిగి తెసులుకున్నారు. సాగు చేస్తున్న పంట విధానం చాలా బాగుందని కితాబునిచ్చారు. రైతులకు సహకరిస్తున్న అగ్రికల్చర్​ విద్యార్థులను అభినందించారు. ఆర్గానిక్​ పద్ధతి ద్వారా పండించిన బియ్యం, కూరగాయలు విక్రయించేందుకు పరిగి మండల పరిషత్​ కార్యాలయంలోని దుకాణ సముదాయాలను వాడుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పరిగి తహసీల్దార్​ ఆనంద్​ రావు, ఎంపీడీఓ నజీర్​, ఆర్​ఐ , ఏఎస్​ఐ తదితరులు పాల్గొన్నారు.  

Tags:    

Similar News