సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి : తాండూరు డీఎస్పీ

మహిళల, విద్యార్థుల భద్రతే షీ టీం ఒక లక్ష్యమని తాండూరు డీఎస్పీ

Update: 2024-10-23 10:42 GMT

దిశ, తాండూరు : మహిళల, విద్యార్థుల భద్రతే షీ టీం ఒక లక్ష్యమని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణ సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతిబాపూలే  స్కూల్, కాలేజీలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళల భద్రత, సైబర్‌ క్రెం, ఆన్‌లైన్‌ మోసాలు తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వ హించారు.అనంతరం డీఎస్పీ బాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ..బాలికల భద్రతే షీ టీమ్స్‌ లక్ష్యమన్నారు. పాఠశాలలో కానీ, బయట ఎక్కడైన ఆకతాయిలు బాలికలను భయాందోళనలకు గురి చేసిన, వేధించినా, ఇబ్బందికరంగా మాట్లాడిన వెంటనే టోల్‌ఫ్రీ నంబర్‌ 100, 181 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. బాలికలను, మహిళలను వేధింపులకు గురి చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు చిన్న విషయాలకు ఆవేదనకు గురి కాకూడదని మంచి ఆలోచనతో చదువుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ప్రవర్తనపై కూడా దృష్టి సారించాలన్నారు. క్రమశిక్షణతో ఉండేలా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి..

ఆన్ లైన్ మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో రోజురోజుకు సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి అన్నారు. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు అంటూ మోసపూరిత ప్రచారాలతో ప్రజలను బూరడీ కొట్టిస్తున్నారని, ఇటువంటి ప్రచారాల పట్ల అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈజీ మనీ ఆశలో పడి మోసపోవద్దని సూచించారు.కొన్ని గంటల్లో, ఒక్క రోజులోనే, వారం రోజుల్లోనే రెట్టింపు నగదు ఇస్తామంటూ ఆన్ లైన్ ట్రేడింగ్ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటూ ఎరవేస్తూ సైబర్ మోసగాళ్లు కుచ్చుటోపి పెడుతున్నారని తెలిపారు. అలాంటి సైబర్ మోసగాళ్లు విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేస్తూ ఆకట్టుకునే ప్రకటనలతో నమ్మిస్తూ మోసం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో షీ టీం ఇంచార్జి శేఖర్, కళాబృందం ఇన్చార్జి అశోక్, ఉపాధ్యాయులు,పోలీస్ సిబ్బంది,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News