వ్యవసాయ శాస్త్రంలో విదేశాల్లో చదవడానికి అవగాహన సదస్సు
విదేశాలలో వ్యవసాయ శాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఉన్న అవకాశాలు.... Awareness Programme
దిశ, శంషాబాద్: విదేశాలలో వ్యవసాయ శాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఉన్న అవకాశాలు, ఫుల్ బ్రైట్ ఫెలోషిప్ పై అవగాహన కల్పించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం ఓ సదస్సు నిర్వహించారు. అఖిల భారత వ్యవసాయ విద్యార్థుల సంఘం, పీజేటీఎస్ఎయు సంయుక్తంగా ఈ సదస్సును ఏర్పాటు చేశారు. యునైటెడ్ స్టేట్స్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ ఈ కార్యక్రమానికి సహకారాన్ని అందించింది. విదేశాలకు వెళ్లి చదివేందుకు ఫుల్ బ్రైట్ ఫెలోషిప్ ను ఏ విధంగా పొందవచ్చు అన్న అంశంపై పలువురు వక్తలు అవగాహన కల్పించారు. ప్రణీత హేమంత్ కుమార్ గౌరవ అతిథిగా పాల్గొని విద్యార్థులకు పీజీ, పీహెచ్ డీ కోర్సులు విదేశాలలో అభ్యసించడానికి ఉన్న అవకాశాలు, అందుబాటులో ఉన్న ఫెలోషిప్ ల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఏ డాక్టర్. సత్యనారాయణ, అసోసియేట్ డీన్ డాక్టర్ నరేంద్ర రెడ్డి, డీన్ పీజీ స్టడీస్ డాక్టర్ అనిత, అఖిల భారత వ్యవసాయ విద్యార్థుల సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అరవింద్, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రవీణ్ కుమార్, వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు.