యథేచ్ఛగా నాపరాతి తవ్వకాలు … పట్టించుకోని సంబంధిత అధికారులు

నాపరాళ్ల తవ్వకాలు జోరందుకున్నాయి. ప్రభుత్వ, పట్టా భూముల్లో అనుమతులు లేకుండా కొందరు అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు.

Update: 2024-03-22 12:32 GMT

దిశ, తాండూరు : నాపరాళ్ల తవ్వకాలు జోరందుకున్నాయి. ప్రభుత్వ, పట్టా భూముల్లో అనుమతులు లేకుండా కొందరు అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు. ఇదంతా తెలిసినా సంబంధిత రెవెన్యూ, మైన్స్‌ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండంటంతో అక్రమార్కులు ఆడిందే ఆట, పాడిందే పాట అన్న చందంగా మారింది. వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామం శివారులో ఉన్న సర్వేనెంబర్ 70లో పట్టా భూమిని ముసుగులో గనుల నిక్షేపాలను తవ్వేస్తున్నారని అదే గ్రామానికి చెందిన జక్కపల్లి కిష్టప్ప అనే వ్యక్తి మూడు రోజుల క్రితం తాండూరు మైనింగ్ కార్యాలయంలో మైనింగ్ ఏడి సత్యనారాయణకు ఫిర్యాదు చేయడం జరిగింది.

గనులు, భూగర్భవనరుల శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా నాపరాళ్లను తరలిస్తూ.. అక్రమార్కులు లక్షలు గడిస్తున్నారు. మరికొందరు పట్టా భూములు ఉండటంతో అనుమతులు తీసుకోకుండానే నాపరాళ్ల తవ్వకాలు చేపడుతూ అందినకాడికి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం ఏదో ఒక చోట నాపరాళ్ల వెలికితీతకు భారీ యంత్రాలను ఉపయోగించి తవ్వకాలు చేపడుతున్నారు. అదే గ్రామానికి చెందిన వ్యక్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ, మైన్స్‌ అధికారులు క్షేత్రసాయికి వెళ్లి అక్రమ తవ్వకాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.


Similar News