అంగన్వాడీల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

ఐసీడీఎస్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాని రాష్ట్ర ప్రభుత్వం తిప్పి కొట్టాలని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అంగన్‌ వాడీలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా అధ్యక్షకార్యదర్శులు రాజు, చంద్రమోన్‌ రాష్ట్ర ప్రభుత్వాని డిమాండ్‌ చేశారు.

Update: 2025-03-17 15:46 GMT
అంగన్వాడీల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
  • whatsapp icon

దిశ, రంగారెడ్డి బ్యూరో: ఐసీడీఎస్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాని రాష్ట్ర ప్రభుత్వం తిప్పి కొట్టాలని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అంగన్‌ వాడీలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా అధ్యక్షకార్యదర్శులు రాజు, చంద్రమోన్‌ రాష్ట్ర ప్రభుత్వాని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్స్‌ సమస్యలును పరిష్కారించాలని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యలో యూనియన్‌ అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి అధ్యక్షతన సోమవారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలు 48 గంటల ధర్నా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఏడు ప్రాజెక్టుల నుంచి సుమారు వెయ్యి మంది అంగన్‌వాడీలు తరలి వచ్చారు.

అంగన్‌వాడీల 48గంటల ధర్నాకు పెద్ద సంఖ్యలో ప్రజా సంఘాలు, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సంఫీుభావం తెలిపింది. సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య అంగన్‌వాడీల ధర్నాకు సంఫీు భావం తెలిపి.. వారికి భరోసా నిచ్చారు. తమ సమస్యలు పరిష్కారం కోసం సీపీఐ(ఎం) మీకు అండగా ఉంటుందని, ఎక్కడి దకా రావాడానికైన మేము సిద్ధంగా ఉన్నమని హామీ ఇచ్చారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షలు రాంచదర్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జగన్‌లు అంగన్‌వాడీలకు మద్ధతు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్‌ వాడీలు పెద్ద ఎత్తున్న తమ డిమాండ్లతో కూడి ఫ్లకార్డులు పట్టుకొని నినాదాలు చేపట్టారు. ఐసీడీఎస్‌ వ్యవస్థను నిర్వీర్యం చేయోద్దు, మా బతుకులను రోడ్డు పాలు చేయోద్దు, కనీస వేతనం అమలు చేయాలి, పోషన్‌ ట్రాకర్‌ వ్యవస్థను రద్దు చేయాలి, అన్‌లైన్‌ వ్యవస్థతో మా ప్రాణాలు తియోద్దు, కాంగ్రెస్‌ మాకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, సకాలంలో వేతనాలు చెల్లించాలి’ అనే డిమాండ్లతో అంగన్‌వాడీలు పెద్ద ఎత్తున్న దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు హోరెత్తించారు.

వేలాది గొంతులతో కలెక్టర్‌ కార్యాలయం ఎదుట హోరహోరిన నినాదాలు మారుమోగాయి. కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఏమీ జరుగుతుందని, అందరు కలెక్టర్‌ కార్యాలయం మొయిన్‌ గేట్‌ వైపు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యతిధిగా హాజరైన సీఐటీయూ రంగారెడ్డి జిల్లా అధ్యక్షకార్యదర్శులు రవి, చంద్రమోన్‌లు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐసీడీఎస్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసి.. కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. నూతన జాతీయ విధానంలో భాగంగా ఐసీడీఎస్‌ను రద్దు చేసే కుట్రలు చేస్తోందన్నారు. ఎన్నో ఏండ్లుగా ఉద్యోగం చేస్తూన్న అంగన్‌వాడీలకు బతుకులను అగం చేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు.

కేంద్ర తీసుకువస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందన్నారు. రాష్ట్రంలో పీఎం శ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకండి అడ్డుకోవాలన్నారు. మొబైల్‌ అంగన్‌వాడలను కూడ ప్రభుత్వం అమలు చేయోద్దన్నారు. కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంగన్‌వాడీలకి ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. అంగన్‌వాడీలకు కనీసం వేతనం రూ. 18 వేలు ఇస్తామని కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో పొందు పరిచిందని, దాని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఈ ఏడాది విద్యాసంవత్సరం నుంచి ఐసీడీఎస్‌ను ప్రయివేటీకరణ చేసేందుకు కుట్రలు చేస్తోందన్నారు. ఇది అమలు జరిగితే రాష్ట్రంలో ఐసీడీఎస్‌ వ్యవస్థ పూర్తిగా బలహీనపడే ప్రమాదం ఉందన్నారు. ఇది పేద ప్రలతో పాటు అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ ఉపాధి కోల్పోతారన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనకి తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

యూనియన్‌ జిల్లా కార్యదర్శి జి. కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అంగన్‌వాడీలను ఉపయోగించుకోని వారికి కావాల్సిన సమచారం తీసుకుంటుందని, కానీ అంగన్‌వాడీ సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే అంగన్‌వాడీలు లేనది ప్రభుత్వం ఒక అడుగు కూడ ముందుకు వేయలేని పరిస్థితి ఉందని అన్నారు. ఐసీడీఎస్‌ పనులు మాత్రమే చేయాల్సిన అంగన్‌వాడీ టీచర్లతో ప్రభుత్వం అనేక పనులు చేయిస్తోందన్నారు. కానీ వారికి ఎలాంటి అలవెన్స్‌లు ఇవ్వడం లేదన్నారు. కనీసం వారికి ఇవ్వాల్సిన వేతనాలు కూడ సకాలంలో ఇస్తున్న పరిస్థితి లేదన్నారు. మీ నుంచి మొయిన్‌ టీచర్లుగా ప్రమోషన్లు ఇచ్చినప్పటికీ.. ఇప్పటి మొయిన్‌ టీచర్లగా వేతనాలు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ ఐసీడీఎస్‌కు ప్రాధాన్యాత ఇవ్వాలి.. ఐసీడీఎస్‌ను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు డి. కిషన్‌ , జగదీశ్‌, రుద్రకుమార్‌, దేవెందర్‌, స్వప్న, శేఖర్‌, ఎల్లేష్‌, బాలరాజు, టీ. నర్సింహ్మ , బుగ్గరాములు తదితరులు పాల్గోన్నారు.


Similar News