స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వేను ఎలాంటి అవాంత‌రాలు లేకుండా పూర్తి చేస్తాం

బండ్ల‌గూడ జాగీర్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ లో స‌మగ్ర కుటుంబ స‌ర్వేనుఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా నిర్వ‌హించేందుకు స‌ర్వం సిద్ధం చేశామ‌ని కార్పోరేష‌న్ క‌మిష‌న‌ర్ శ‌ర‌త్ చంద్ర వెల్ల‌డించారు.

Update: 2024-11-10 13:19 GMT

దిశ, గండిపేట్: బండ్ల‌గూడ జాగీర్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ లో స‌మగ్ర కుటుంబ స‌ర్వేనుఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా నిర్వ‌హించేందుకు స‌ర్వం సిద్ధం చేశామ‌ని కార్పోరేష‌న్ క‌మిష‌న‌ర్ శ‌ర‌త్ చంద్ర వెల్ల‌డించారు. స‌ర్వేను పుర‌స్క‌రించుకొని ఆదివారం కార్పోరేష‌న్ ప‌రిధిలోని 12 వ డివిజ‌న్లో ఎన్యుమ‌రేష‌న్ బ్లాక్ 30 ఏ, 40 ఏ, 42-2 ల‌లో ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా క‌మిష‌న‌ర్ శ‌ర‌త్ చంద్ర మాట్లాడుతూ.. కార్పోరేష‌న్ ప‌రిధిలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను ప‌క‌డ్బందీగా నిర్వ‌హించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వివ‌రించారు. ఈ మేర‌కు అంద‌రూ అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేస్తున్నార‌న్నారు. ఈ కుటుంబ స‌ర్వేలో భాగంగా ప్ర‌తి రోజు 10 నుంచి 15 కుటుంబాల‌ను ఎన్యుమ‌రేట‌ర్ క‌లిసి వివ‌రాల‌ను సేక‌రిస్తార‌న్నారు. వివ‌రాల సేక‌ర‌ణ‌లో ఎలాంటి త‌ప్పులు లేకుండా చూసుకోవాల‌ని ఎన్యుమ‌రేట‌ర్ల‌కు సూచించారు. ఈ ప్ర‌క్రియ‌ను సూప‌ర్ వైజ‌ర్లు ప‌ర్య‌వేక్షించాల‌ని సూచించారు. ప్ర‌జ‌లు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ను ప్రజలు సహకరించాలని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎన్యుమ‌రేట‌ర్లు, అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.


Similar News