మణికొండ చైర్మన్ కస్తూరి నరేందర్ సోదరుడి కుమారుడిపై కేసు నమోదు
కారు నెంబర్ ప్లేట్ పై పేరు రాసుకున్న మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ సోదరుడి కుమారుడిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు.
దిశ, గండిపేట్ : కారు నెంబర్ ప్లేట్ పై పేరు రాసుకున్న మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ సోదరుడి కుమారుడిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఓ కారును సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ సోదరుడి కుమారుడు శ్రావణ్ తన కారుపై నంబర్ ప్లేట్ కు బదులుగా తన పేరు రాసుకొని కొన్ని రోజులుగా తిరుగుతున్నాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం నార్సింగి పోలీసుల దృష్టికి రావడంతో పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ మేరకు కారును పోలీసులు సీజ్‌చేశారు.