సీఈఐజీ‌గా రామాంజనేయులు బాధ్యతల స్వీకరణ

రాష్ట్ర విద్యుత్ ప్రధాన తనిఖీ అధికారి(సీఈఐజీ)గా సీహెచ్ రామాంజనేయులు ను నియమించారు. కాగా ఆయన బుధవారం తన కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు.

Update: 2024-09-25 17:11 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర విద్యుత్ ప్రధాన తనిఖీ అధికారి(సీఈఐజీ)గా సీహెచ్ రామాంజనేయులు ను నియమించారు. కాగా ఆయన బుధవారం తన కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రామాంజనేయులును తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు కలిశారు. పూలమాలతో ఆయనను ఘనంగా సత్కరించారు. సీఈఐజీగా ఉన్న ఎస్ శ్రీనివాసరావు ఉద్యోగ విరమణ పొందారు. కాగా ఆయన స్థానంలో ఇటీవల పదోన్నతి పొంది రామాంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. ఆయనను కలిసిన వారిలో ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ అసోసియేషన్ నాయకులు నేమాల బెనర్జీ, నక్క యాదగిరి,జీసీ రెడ్డి, నామిని వెంకటేష్, రాఘవయ్య, నాగయ్య, శంకర్ బాబు, శివకుమార్, నరేష్ కుమార్, నరేంద్ర చారి ఉన్నారు.


Similar News