ఆయిల్ ఫాం మిల్లుల స్థాపన వేగవంతం చేయాలి: మంత్రి తుమ్మల

ఆయిల్ పాం ప్రాసెసింగ్ మిల్లు స్థాపన పనులను వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సూచించారు.

Update: 2024-09-25 17:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఆయిల్ పాం ప్రాసెసింగ్ మిల్లు స్థాపన పనులను వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సూచించారు. సచివాలయంలో బుధవారం గోద్రేజ్ అగ్రోవెట్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ , ఫుడ్ ప్రాసెసింగ్ మరియు రిఫైనరీ ఏర్పాటు పై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది కనీసం 15000 ఎకరాల పైన ఆయిల్ పాం సాగు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని, తదనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకొని లక్ష్యాన్ని సాధించాలన్నారు. ప్రభుత్వం తరపున ఎలాంటి సహకారం కావాలని అందజేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ మరియు ప్రాసెసింగ్ యూనిట్ల మెరుగుదల పై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి, గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ ఎండీ బలరాం సింగ్ యాదవ్, ఆయిల్ పామ్ సీఈఓ సౌగత నియోగి, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.


Similar News