RGV: దేవుళ్లను కూడా అరెస్ట్ చేస్తారా?.. రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్

మెగా హీరో అల్లు అర్జున్(Allu Arjun) అరెస్ట్‌పై టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) స్పందించారు.

Update: 2024-12-13 13:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో అల్లు అర్జున్(Allu Arjun) అరెస్ట్‌పై టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా(X) వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. ట్వీట్‌లో తెలంగాణ పోలీసుల(Telangana Police)పై ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా సమాధానం చెప్పాలని నాలుగు ప్రశ్నలు సందించారు. అందులో 1. పుష్కరాలు, ఉత్సవాలు జరిగినప్పుడు తోపులాటలో భక్తులు చనిపోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా?. 2. ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారా?. 3. ప్రీరిలీజ్ ఫంక్షన్స్‌లో ఎవరైనా చనిపోతే హీరో, హీరోయిన్లను అరెస్ట్ చేస్తారా?. 4. భద్రత ఏర్పాట్లు పోలీసులు ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు, ప్రజా నాయకులు ఎలా కంట్రోల్ చెయ్యగలరు? అని రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు.

Tags:    

Similar News