TGSRTC: రాఖీ పండగ ఎఫెక్ట్.. ఆర్టీసీలో రికార్డు స్థాయి ప్రయాణాలు

సోమవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ రికార్డు సృష్టించింది.

Update: 2024-08-20 05:41 GMT

దిశ, వెబ్ డెస్క్: సోమవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ రికార్డు సృష్టించింది. ఇప్పటికే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం తో ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణం భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలో రాఖీ పండుగ రావడంతో ఉచిత బస్సు సౌకర్యాన్ని పూర్తిగా వినియోగించుకున్నారు. దీంతో రాఖీ పౌర్ణమి నాడు రికార్డు స్థాయిలో ప్రయాణికులు.. ఆర్టీసీ బ‌స్సుల్లో ఒకేరోజు 63.86 లక్షల మంది ప్రయాణించిట్లు టీజీ ఆర్టీసీ ప్రకటించింది. ఇందులో మ‌హాల‌క్ష్మి ప‌థ‌కాన్ని 41.74 లక్షల మంది మహిళలు వినియోగించుకున్నట్లు తెలిపారు. కాగా ఒక్కరోజులోనే మ‌హిళ‌ల‌కు రూ.17 కోట్లు ఆదా అయినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే పండుగ సమయంలో మహిళలను, ప్రయాణికులను సేఫ్‌గా గమ్యస్థానాలకు చేర్చి, రికార్డు సృష్టించిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి, ఉన్నతాధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News