రాజాసింగ్ ఓ కమెడియన్: వైఎస్ షర్మిల

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవితపై వస్తున్న ఆరోపణల అంశాన్ని పక్కదారి పట్టించేందుకు టీఆర్ఎస్, బీజేపీ కలిసి రాజాసింగ్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని

Update: 2022-08-25 14:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవితపై వస్తున్న ఆరోపణల అంశాన్ని పక్కదారి పట్టించేందుకు టీఆర్ఎస్, బీజేపీ కలిసి రాజాసింగ్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని వైఎస్ఆర్ టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాజాసింగ్ వెనుక ఉన్నది సీఎం కేసీఆర్ అనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. డైవెర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే రాజాసింగ్ ఎపిసోడ్ తీసుకువచ్చారనే సందేహాలు ఉన్నాయన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న రాజాసింగ్ ఒక కమెడియన్ అన్నారు. ఎమ్మెల్యేగా అన్ని మతాలు, వర్గాల వారికి ప్రాతినిధ్యం వహించాల్సి ఉన్న రాజాసింగ్ ఇతర మతాలను కించపరిచేలా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే స్థాయి చేతకాకుంటే కమెడియన్‌గా ఉండాలని సూచించారు.

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బాధేస్తోందని ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఆ చిచ్చులో రాజకీయ చలి కాచుకోవాలనుకుంటున్నారని మండిపడ్డారు. భిన్న మతాలు, భిన్న సంస్కృతులకు నిలయమైన హైదరాబాద్‌లో మతత్వ రాజకీయాలు సరికాదన్నారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం బీజేపీకి ఇష్టం లేదని ఆరోపించారు. ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌కు సస్పెండ్ చేశాం, షో కాజ్ నోటీసులు ఇచ్చామని బీజేపీ చెబుతోందని సస్పెండ్ చేస్తే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాలి కానీ వివరణలు కోరుతారా అని ప్రశ్నించారు. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మసీదులు తవ్వుదామని చెప్పారని ఆయనపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'రాజాసింగ్​పై పీడీ యాక్ట్‌ను స్వాగతిస్తున్నాం.. ఆయన శాసన సభ్యత్వం రద్దు చేయాలి..' 


Similar News